అంత జీతమా....ఓర్నాయనో.... - MicTv.in - Telugu News
mictv telugu

అంత జీతమా….ఓర్నాయనో….

July 4, 2017

ఏం కొల్వు జేస్తున్నవ్. జీతం ఎంత. ఖర్చులన్నీ పోను ఎంత  మిగుల్తది…. ఏమన్న ఏన్కేస్తున్నవా లేదా… ఇట్లా చుట్టాలు, పక్కాలు అడుగుతరు. ఓకాయన జీతం గురించి తెలిస్తే కచ్చితంగా నోరల్ల వెట్టుడు ఖాయం. అంతేనా… ముందు ఈ స్టోరీ చూసిన తర్వాత మిగతా మీరే అనుకుంటరు… మీకు తోచింది……….

కండల వీరుడు సల్మాన్ ఖాన్ దగ్గర బాడీ గార్డుగ షేరా అనే టాయన పనిచేస్తున్నడు. ఈయన అస్సలు పేరు  గుర్ మిత్ సింగ్ జాలీ. హీరో అనంగనే.. అభిమానులు గుంపులు గుంపులొచ్చి మీద పడకుండా ఇరవై యేండ్ల  నుండి  బాడీగార్డుగ పనిచేస్తున్నడు. ఒక్క తానే ఇన్ని దినాలు  ఉద్యోగం చేసుడంటే మాటలు కాదు. అయితే ఈ నెలకు   సల్మాన్ ఖాన్ ఇస్తున్న జీతం అక్షరాల 15 లక్షల రూపాయలు.  పేద్ద కార్పొరేట్ కంపెనీ సీఈవోకు ఇస్తున్న జీతంతో సమానం అనుకోవచ్చేమో.   యేటా రెండు కోట్ల రూపాయలన్నమాట. మరింత  జీతం ఇస్తున్నడంటే… పని కూడా అట్లనే ఉంటది.

పని ఎట్లా ఉంటేంది… కండ్లు తిర్గే ప్యాకేజీ అది. బాడీ గార్డుకే బాడీ గార్డంటే… ఆ మాత్రం  జీతం లేక పోతే ఎట్లా. కండలుంటెనే సరిపోదు… జీతాలియ్యనీకే గుండే కూడా ఉండాలి.