దబాంగ్ -3 ట్రైలర్ రిలీజ్.. మీరూ చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

దబాంగ్ -3 ట్రైలర్ రిలీజ్.. మీరూ చూడండి

October 23, 2019

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ నటించిన దబాంగ్ -3 సినిమా ట్రైలర్ విడుదలైంది. దీంట్లో కిచ్చ సుదీప్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే హీరోయిన్ మాత్రం సోనాక్షి సిన్హానే తీసుకున్నారు. దీంట్లో ఆమె సల్మాన్ భార్యగా నటించారు. అయితే సల్మాన్ ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రం ఓ లవ్‌స్టోరీ ఉన్నట్లు ట్రైలర్ చూపించారు. ప్రేయసిగా సయీ మంజ్రేకర్ నటించారు. 

సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానలు మరింత అంచనాలు పెంచేసుకున్నారు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.కాగా దక్షిణాదిలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దబంగ్ -3లో కొన్ని పాత్రలు మారాయి. దబాంగ్‌లో సోనూసూద్‌, దబాంగ్ 2లో ప్రకాశ్ రాజ్ విలన్స్‌గా నటించగా ఈసారి కిచ్చ సుదీప్ విలన్‌గా కనిపించనున్నారు.