సల్మాన్ ఖాన్‌కు బెయిల్.. కాసేపట్లో విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్ ఖాన్‌కు బెయిల్.. కాసేపట్లో విడుదల

April 7, 2018

కృష్ణజింకల వేటకేసులో జైలుకెళ్లిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బెయిల్ దొరికింది. ప్రజలకు అతని జైలు జీవితం వార్తలను చదవాల్సిన ఖర్మ తప్పింది. రూ.50 వేల పూచీకత్తుపై సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్‌ కోర్టు శనివారం మధ్యాహ్నం తీర్పు చెప్పింది. ఆదేశాల కాపీ అందిన వెంటనే జోధ్‌పూర్‌ జైలు నుంచి కాసేపట్లో విడుదల కానున్నాడు.20 ఏళ్ల నాటి కేసులో సల్మాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష వేసిన సంగతి సంగతి తెలిసిందే.  దీంతో 52 ఏళ్ల సల్మాన్ కుదేలయ్యాడు. కోర్టులోనే భోరున విలపించాడు. రెండు రోజులు జైల్లో ఉన్నాడు. రేప్ కేసులో జైల్లో ఉన్న ఆశారాం బాపూతో కలసి గదిని పంచుకున్నాడు. జింకల కేసులో సహనిందితులైన నటులు సైఫ్ అలీ ఖాన్, నీలం, టబు, సోనాలి బెంద్రేలను కోర్టు సంశయాత్మక లాభం కింద నిర్దోషులుగా వదిలేసింది.