వేలంవెర్రి.. సల్మాన్ కోసం 600 కి.మీ. తొక్కుకుంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

వేలంవెర్రి.. సల్మాన్ కోసం 600 కి.మీ. తొక్కుకుంటూ..

February 14, 2020

Salman Khan Fan.

స్టార్ హీరోలను కలిసేందుకు అభిమానులు వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌‌‌ను కలిసేందుకు ఆయన అభిమాని భుపెన్ లిక్సన్ అరుదైన ఫీట్ చేశాడు. 

ఈనెల 15న అస్సాం రాజధాని గువాహటి వేదికగా ఫిల్మ్‌ఫేర్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం జరుగనున్న సంగతి తెల్సిందే. ఇందులో పాల్గొనడానికి సల్మాన్ ఖాన్ వస్తున్నాడు. దీంతో తన అభిమాన నటుడిని ఎలాగైనా కలవనుకున్నాడు అదే రాష్ట్రంలోని తీన్‌సుకియా ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల భుపెన్. దీంతో దాదాపు 600 కి.మీ. సైకిల్‌పై ప్రయాణించి శుక్రవారం రోజున గువాహటి చేరుకున్నాడు. ఫిబ్రవరి 8న ఆయన సైకిల్ ప్రయాణం మొదలుపెట్టాడు. సైక్లింగ్‌లో భూపెన్ ఇప్పటికే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లోకి ఎక్కాడు. హ్యాండిల్స్ పట్టుకోకుండా 48 కిలోమీటర్ల దూరాన్ని 60 నిమిషాల్లో పూర్తి చేసినందుకు ఆయన పేరు రికార్డుల్లో నమోదైంది.