సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష

April 5, 2018

కృష్ణజింకను చంపిన కేసులో కండల వీరుడు సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. 20 ఏళ్లుగా నానుతున్న ఈ కేసులో జోధ్పూర్ చీఫ్ జుడిషయల్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రూ. 10 వేల జరిమానా కూడా విధించింది. సల్మాన్ను అధికారులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. అతడనికి బెయిల్ వచ్చే అవకాశముంది. అయితే అది వచ్చే లోపు కనీసం ఒకరోజు జైల్లో ఉండాల్సి వస్తుంది.ఈ కేసులో సహనిందితులైన నీలమ్, సైఫ్ అలీఖాన్, సోనాలి బెంద్రేలను సంశయాత్మక లాభం కింద నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. సల్మాన్, సహనిందితులంతా కలసి ‘హమ్ సాథ్ సాథ్ హై‘ సినిమా షూటింగ్ సందర్భంగా రక్షిత జంతువైన కృష్ణజింకను చంపారని ప్రాసిక్యూషన్ వాదించింది. సల్మాన్ తుపాకీతో కాల్చాడని, మిగతావారు అతణ్ని ప్రోత్సహించారని తెలిపింది. సల్మాన్‌పై వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 కింద, మిగతావారిపై సెక్షన్ 149 కింద కేసు అభియోగాలు నమోదు కాగా, మార్చి 28న కేసు విచారణ ముగిసింది.

దానాలు చేశాడు.. శిక్ష తగ్గించండి..

సల్మాన్ చాలా దానధర్మాలు చేశాడు కనుక దీన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ శిక్ష వేయాలని అతని లాయర్లు కోరారు. సల్మాన్‌కు జైలుశిక్ష వల్ల అతని సినిమాలు చిక్కుల్లో పడ్డాయి. దాదాపు వంద కోట్ల ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి. సల్మాన్‌పై ఈ కేసుతోపాటు చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులో సహనిందితులను వదిలేయడంపై అప్పీలు వెళ్లాలని కృష్ణజింకలను పిల్లల్లా సాక్కునే బిష్ణోయ్ తెగ ప్రజల సంఘం నిర్ణయించింది. అక్రమాయుధాలు, కారుతో మనుషులను ఢీకొట్టి చంపేసి, పారిపోవడం వీటిలో కొన్ని. అయితే సాక్ష్యాలు దొరక్కపోవడం తదితర కారణాలతో నిర్దోషిగా విడుదలయ్యాడు. చింకారా జంతువు హత్య వంటికేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు.