Home > Featured > హాయ్ తమ్మీ.. విక్కీ కౌశల్‌ను వాటేసుకున్న సల్మాన్..

హాయ్ తమ్మీ.. విక్కీ కౌశల్‌ను వాటేసుకున్న సల్మాన్..

salman Khan hugs co-actor Vicky Kaushal after his security insults him

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మూడ్ మారింది. తన వీడియో తాను చూసుకున్నాడో లేకపోతే, సోషల్ మీడియాలో తిట్లకు జడుసుకున్నాడోగాని పద్ధతి మార్చుకున్నాడు. సొంత తమ్ముడిలాంటి కుర్ర నటుడు విక్కీ కౌశల్‌ను తనే చొరవ తీసుకుని ముందుకు వెళ్లి ఆలింగనం చేసుకుంటున్నాడు. అబూదాబీలో జరుగుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో సల్మాన్ భద్రతా సిబ్బంది శుక్రవారం విక్కీ కౌశల్‌ను దురుసుగా నెట్టేయగా, సల్మాన్ చంపుతా అన్నట్లు కొరకొరా చూసి వెళ్లిపోయాడు. దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. సాటి నటుడిని అలా అవమానించడం సరికాదని, సీనియర్ నటుడిలా కుండా గూండాలా వ్యవహరించాడని సల్మాన్‌ను నెటిజన్లు తిడుతున్నారు. తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌ను విక్కీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండడం కండల వీరుడికి జీర్ణం కావడం లేదని, దానికి ఉదాహరణ ఆ అక్కసు చూపేనని అంటున్నారు.

ఈ నేపథ్యంలో అదే అవార్డు వేదికపై సల్లూ భాయ్ విక్కీని ఆలింగనం చేసుకున్నాడు. ఇది కూడా తెగ వైరల్ అయింది. సల్మాన్ పశ్చాత్తాపంతో విక్కీని దగ్గరికి తీసుకున్నాడని జనం కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే వీక్కీ కోపతాపాలకు పోకుండా చాలా హుందాగా ప్రవర్తించాడని మెచ్చుకుంటున్నారు. తనను సల్మాన్ సెక్యూరిటీ సిబ్బంది తోసేయడంపై విక్కీ స్పందించాడు. ‘‘ఏవోవో మాట్లాడుకుంటారు. అర్థం లేని విషయాలపై చెవులు కొరుక్కుంటారు. వీడియో కనిపించింది విషయం వేరు, జరిగిన విషయం వేరు. దాని గురించి మాట్లాడ్డం దండగ’’ అని అన్నాడు. ఉడి, సర్దార్ ఉధమ్ తదితర హిట్లో మాంచి జోరుమీదున్న విక్కీ ‘సామ్ బహుదూర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సారా ఖాన్‌తో కలసి ‘జరా హట్కే జరా బచ్కే’లోనూ నటిస్తున్నాడు.

Updated : 27 May 2023 6:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top