గర్ల్‌ఫ్రెండ్‌తో చీపురు పట్టిన సల్మాన్ ఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

గర్ల్‌ఫ్రెండ్‌తో చీపురు పట్టిన సల్మాన్ ఖాన్

June 6, 2020

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని చక్కగా వినియోగించుకున్నారు. తన ఫామ్‌హౌస్‌లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. చీపురు పట్టి పరిసరాలను ఊడ్చారు. ఆయనతో పాటు ఫామ్‌హౌస్‌లో పనిచేసేవారు కూడా క్లీనింగ్ ప్రక్రియ చేపట్టారు. బీయింగ్ సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోని సల్మాన్ షేర్ చేశారు. తనతో పాటు తన ప్రియురాలు లులియా వంటూర్ కూడా సల్మన్‌కు జతగా చీపురు పట్టి ఊడ్చారు. 

సల్మాన్ షార్ట్- టీషర్ట్ వేసుకుని పెరిగిన గడ్డంతో ఎంతో సింపుల్‌గా ఉన్నారు. చీపురు పట్టి రోడ్‌లో పడి ఉన్న చెత్తను ఊడ్చి డస్ట్ బిన్‌లో వేశారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పాటుపడాలని సల్మాన్‌ఖాన్‌ తన అభిమానులకు సూచించారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సల్మాన్ అభిమానులు బాగా లైక్ చేస్తున్నారు.