ఐపీఎల్ ఫైనల్‌కు హోస్టులుగా సల్మాన్, కత్రినా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్ ఫైనల్‌కు హోస్టులుగా సల్మాన్, కత్రినా..

May 12, 2019

ఐపీఎల్ సీజన్ 12 తుది పోరు నేడు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ తుది ఆటలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ఆదివారం అవడంతో చాలామంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను తిలకించడానికి ఉవ్వీళ్ళూరుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత తోడైంది. బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మ్యాచ్‌కు హోస్టులుగా విచ్చేయనున్నారు. మ్యాచ్‌కు ముందు నిర్వహించే కార్యక్రమంలో వాళ్లిద్దరూ కనువిందు చేయనున్నారు. ప్రేక్షకులకు అటు అభిమాన క్రికెటర్లను, ఇటు అభిమాన నటులను ఒకే వేదికపై చూసే అవకాశం ఒకేసారి లభించనుంది.

Salman Khan, Katrina Kaif to host IPL 2019 final pre-match shows

సల్మాన్, కత్రినా కలిసి నటించిన చిత్రం ‘భారత్‌’ జూన్‌ 5న విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రచారం చేసుకునేందుకు వాళ్లు టీవీ స్టూడియోలో కనిపించనున్నారట. ఆట ఈ రోజు రాత్రి 7.30గంటలకు ప్రారంభంకానుంది. స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌లో వచ్చే ప్రీమ్యాచ్‌ కార్యక్రమంలో వీళ్లిద్దరూ పాల్గొని ఫైనల్‌ మ్యాచ్‌ గురించి వాళ్ల అభిప్రాయాలు చెప్తారు.