త్వరగా కోలుకోండి బాలు సార్.. సల్మాన్ ఖాన్ భావోద్వేగం - MicTv.in - Telugu News
mictv telugu

త్వరగా కోలుకోండి బాలు సార్.. సల్మాన్ ఖాన్ భావోద్వేగం

September 25, 2020

mnbhvn m

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన త్వరగా కోలుకోవాలంటూ పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ నేరుగా ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిపై ఆరా తీయగా.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోండి బాల సుబ్రమణ్యం సార్ అని పేర్కొన్నారు. 

‘మీర నా సినిమాలకు పాడిన పాటలకు ధన్యవాదాలు. మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మారాలని.. త్వరగా కోలుకోవలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అంటూ తన కోసం బాలు పాడిన పలు సినిమాలను గుర్తు చేసుకున్నారు. కాగా, మైనే ప్యార్ కియా సినిమాతో బాలు సల్మాన్ ఖాన్ సినిమాలకు పాటలు పాడారు. 1990 నుంచి చాలా సినిమా పాటలను  బాలు చేత పాడించేవారు. తుమ్సే మిల్నే కి తమన్నా హై, కబీ తు చాలియా లగ్తా హై,దిల్ దీవానా,సాథియా ట్యూన్ క్యా కియా వంటి పాపులర్ పాటలను బాలు పడిన సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు అభిమానులు కూడా బాలు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడూ ఆరా తీస్తూనే ఉన్నారు.