రైతుగా మారిన బాలీవుడ్ కండల వీరుడు..ఫోటో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

రైతుగా మారిన బాలీవుడ్ కండల వీరుడు..ఫోటో వైరల్

July 12, 2020

Salman Khan

కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెల్సిందే. దీంతో నటీనటులు, దర్శక నిర్మాతలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఫామ్ హౌజ్ లకు వెళ్లిపోయారు. అలాంటి వారిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకరు. దేశంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌజ్ లో సేదతీరుతున్నారు.

ఫామ్ హౌజ్ లో ఊరికే ఉండకుండా సల్లూ భాయ్ వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల వ్యవసాయం చేస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఆ ఫోటోకి తినేవాడి పేరు ధాన్యం మీద రాసి ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ప్రస్తుతం ‘రాధే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వీరి‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడం గమనార్హం. ఈ సినిమాలో రణ్‌దీప్‌ హుడా, జాకీ ష్రాప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిశాపటాని హీరోయిన్ గా నటిస్తుంది.