Salman Khan takes up Green India Challenge, plants saplings at Ramoji Film City
mictv telugu

మొక్క నాటామా.. పని అయిపోయిందా అని కాదు.. శ్రద్ధ తీసుకోవాలి’

June 22, 2022

Salman Khan takes up Green India Challenge, plants saplings at Ramoji Film City

ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన స‌ల్లూభాయ్‌, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి “గ్రీన్ ఇండియా చాలెంజ్ 5.0” లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని..ఆ పనికి ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా బాటలు వేసారని పేర్కొన్నారు. తన అభిమానులంతా విధిగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని స‌ల్మాన్ ఖాన్‌ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.