Salman Khan unfair behavior with Katrina Kaif Tip Tip Barsa Paani bigboss
mictv telugu

కత్రినాతో సల్మాన్ ఖాన్ వెకిలి చేష్టలు..

October 29, 2022

హిందీ బిగ్ బాస్ 16 రాబోయే ఎపిసోడ్‌ను చూడడానికి ఆడియన్స్ తెగ ఆత్రంగా ఉన్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది తమ సినిమా ‘ఫోన్ భూత్’ మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ స్టేజ్ ఎక్కేసింది చిత్ర బృందం. ఇందులో ప్రత్యేకత ఏముందని కదా మీ అందరి డౌట్. ఎందుకంటే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే ఈ షోకి తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ కూడా రాబోతుంది. బాలీవుడ్‌లో ఒక గాడ్ ఫాదర్‌గా, బాయ్ ఫ్రెండ్‌గా కత్రినా కెరీర్ ని దెగ్గరుండీ పరుగులు పెట్టించాడు సల్మాన్. పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లిపై కూడా పెద్ద పుకార్లే వచ్చాయి. కానీ అనూహ్య రీతిలో సల్లు భాయ్‌కి బ్రేకప్ చెప్పేసింది కత్రినా. అయినా కూడా సల్మాన్ ఖాన్ కొద్దిరోజులు వన్‌సైడ్ లవ్ ట్రాక్ నడిపించాడని రూమర్స్ ఉన్నాయి. కానీ హఠాత్తుగా బాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కత్రినా. సల్మాన్ ఖాన్, అతని కుటుంబం పెళ్లి పెద్దలుగా కత్రినా వివాహం జరిపించారు.

అయితే ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి పెళ్ళికి పెద్దగా సల్మాన్ ఖాన్ తోడుగా నిలవటం జరిగింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ప్రేమిస్తే అంతేమరి. ఎట్టి పరిస్థితుల్లో బంధం వదులుకోడని టాక్. అయితే ఇప్పుడు కత్రినా ఎంతకాదన్న వివాహిత. విక్కీ భార్య. అలాంటి కత్రినాపై సల్మాన్‌కు మునుపటి ప్రేమ గుర్తొచ్చిందో లేక ప్రమోషన్స్ కోసమో కానీ కాస్త వెకిలిగా ప్రవర్తించాడని ట్రోల్స్ వస్తున్నాయి. తన ఫోన్ భూత్ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన కత్రినా కాస్త ఇబ్బందికి గురయ్యేలా సల్మాన్ ప్రవర్తించాడని అంటున్నారు. బిగ్ బాస్ స్టేజిపై రొమాంటిక్ సాంగ్‌కు స్టెప్పులేస్తూ.. కత్రినా మరొకరి ఇల్లాలు అన్నది సల్మాన్ మర్చిపోయాడని అంటున్నారు. బిగ్ బాస్ టీమ్ విడుదల చేసిన ప్రోమోలో సల్మాన్‌తో కలిసి ఇబ్బందిగా కత్రినా డాన్స్ చేసిందా.. ‘టిప్ టిప్ బర్సా పానీ…’ అనే రొమాంటిక్ పాటకు డ్యాన్స్ వేయించటం ఏంటని ట్రోల్స్ వస్తున్నాయి. ఎప్పటిలానే చనువుగా సల్మాన్ ప్రవర్తిస్తే.. ఇల్లాలిగా కత్రినా ఇబ్బందులు పడిందని కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా మాజీ ప్రియురాలితో కలిసి సల్మాన్ బిగ్ బాస్ 16 ఎపిసోడ్‌ను రంజుగా పసందుగా సిద్ధం చేసారని మరికొందరు అంటున్న మాట.