సల్మాన్ అక్షయ్ ను స్టార్ చేస్తున్నాడా ? - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్ అక్షయ్ ను స్టార్ చేస్తున్నాడా ?

June 23, 2017

స్టార్ హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్ తాను ఎంతమాత్రమూ స్టార్ ను కాను.. ఇదిగో అక్షయ్ కుమార్ అవ్వల్ స్టార్ అని కితాబిచ్చాడు. ఒక స్టార్ ఇంకొక స్టార్ హీరోని మెచ్చుకోవడం అనేది అరుదు. కానీ సల్మాన్ అలా తనను మెచ్చుకునేసరికి అక్షయ్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

‘ నేను ఏడాదికి ఒక సినిమానే చేస్తాను, నాతోటి స్టార్లైన షారూఖ్ కూడా ఒకటే చేస్తాడు, ఇక అమీరైతే మరీ లేజీగా మూడేళ్ళకు ఒక సినిమా మాత్రమే చేస్తాడు.. కానీ అక్షయ్ మాత్రం ఏడాదికి మూడు సినిమాల వరకు చేస్తున్నాడు. అంటే అతనే నిజమైన స్టార్ హీరో.. మేము అస్సలు కాము.. ’ అని సల్మాన్ చెప్పగానే అక్షయ్ సల్మాన్ని గట్టిగా హత్తుకున్నాడు.

‘ అన్న మాట నాకు సూపర్ బూస్ట్ ఇచ్చింది. ఇక నేను మరింత రెచ్చిపోయి ఏడాదికి నాలుగు సినిమాల వరకు చేసే ప్రయత్నం చేస్తానని ’ హుషారు వ్యక్తం చేస్తున్నాడు అక్షయ్.