సమంత ట్వీట్....  ఘాటు రెస్పాన్స్..... - MicTv.in - Telugu News
mictv telugu

సమంత ట్వీట్….  ఘాటు రెస్పాన్స్…..

July 25, 2017

ఈ మధ్య కాలంలో ఓ హిరోయిన్ రాతలకు ఇంత స్పందన రావడం ఇదే ఫస్ట్  కావొచ్చు. ఈ హిరోయిన్ మాట్లాడినా… రాసినా  కాస్త బుర్ర ఉందే అన్పిస్తుంది. ఏదైనా విషయం చెప్పినా సరే ఆత్మగౌరవం  మాటల్లో  స్పష్టంగా కన్పిస్తుంది. అంతేకాదు తానకూ ఓ వ్యక్తిత్వం ఉందని  ప్రూవ్ చేసుకుంటున్నది కూడా. ఇంతలా చెప్తున్నది ఎవరి గురించో కాదు…. అక్కినేని వారికి కాబోయే కోడలు సమంత గురించే.

ఈ టాలీవుడ్ నటీమణి  తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం తెల్సిందే. అందుకేనేమో తన తల్లి  చేనేత చీర కట్టుకున్న ఫోటోను ట్వీట్టర్లో పోస్టు చేసి… యువతులకు ఓ పోటీ పెట్టింది. యువతులు తమ తల్లి ధరించే చేనేత చీరను  ఫ్యాషన బుల్ గా కట్టుకుని ఫోటో దిగి దానికి రివైన్ హ్యాండ్ లూమ్ , వోవెన్ 2017 అనే పదాల హ్యాష్ టాగ్ తో పోస్టు చేయాలని సూచించింది. అలా వచ్చిన ఫోటోల నుండి ఐదుగురిని ఎంపిక చేసి తెలంగాణ స్కిల్డ్ ఆర్టిసన్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వోవెన్ ఫ్యాషన్ షోకు ఆహ్వానించనున్నట్లు  రాసింది. ఈమె చేసిన ట్వీట్ కు మాంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి యువతలు కుప్పలు తెప్పలుగా ఫోటోలు దిగి పంపిస్తున్నారట. సమంతా మజాకా మరి.