Sama Venkata Reddy, who nominated as an independent candidate for Munugode by-election, supports TRS
mictv telugu

మునగోడు ఉపఎన్నిక: టీఆర్ఎస్‌కి మద్ధతిస్తానంటున్న స్వతంత్ర అభ్యర్థి

October 30, 2022

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఏ రోజుకారోజు ముఖ్య పార్టీల నేతలతో ప్రచారం హీటెక్కెతోంది. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో నేతలు జోరు పెంచారు. నామినేషన్ వేసిన ఆయా పార్టీలకి చెందిన నేతలంతా గెలుపే లక్ష్యంగా ప్రచారాలు, బహిరంగ సభలు పెడుతున్నారు. జనాలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక కోసం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం టీఆర్ఎస్‌కి మద్ధతుగా నిలవడం ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సీనియర్ నాయకుడైన సామ వెంకట్ రెడ్డి.. ఇండిపెండెంట్ గా నామినేషన్ ఇప్పుడు టీఆర్ఎస్ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నానంటున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల్లో మంచి గుర్తింపు ఉన్న సామా వెంకటరెడ్డి.. ఆర్టీసీ ఎంప్లాయిస్ కి సంబంధించిన సమస్యల పరిష్కారానికై.. ప్రజల్లో తన ఉనికిని చాటుకోడానికై మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలు..
1 మూడు డిఏలు ప్రకటించడం
2 ఎంప్లాయిస్ కి అమౌంట్ సెటిల్ చేయడం
3 సకల జన సమ్మె కాలంలో వేతనాన్ని కార్మికులకు కట్టించడం వంటి వాటిని పరిష్కరించడం వల్ల తాను టిఆర్ఎస్ అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఈరోజు మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో హైదరాబాదులో టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీలో జాయిన్ అయ్యారు. మంత్రి చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ ఎంప్లాయిస్‌కి టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే లాభం జరుగుతుంది కాబట్టి టిఆర్ఎస్ అభ్యర్థిని మునుగోడు లో గెలుపుకు ఆర్టీసీ ఎంప్లాయిస్ అందరికి సమన్వయం చేసుకొని తన మద్దతును తెలుపుతానని మంత్రికి తెలిపారు.