Samajwadi party leader Akhilesh Yadav slams bjp modi government at brs Khammam public meeting
mictv telugu

రోజులు లెక్కబెట్టుకుంటున్న మోదీ.. అఖిలేష్

January 18, 2023

Samajwadi party leader Akhilesh Yadav slams bjp modi government at brs Khammam public meeting

కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ హెచ్చరించారు. ‘‘బీజేపీ ప్రభుత్వ అవినీతిని, తప్పుడు విధానాలను విమర్శిస్తే ఈడీ, సీబీఐలతో దాడులు చేస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. సరైన నిర్ణయం తీసుకుంటారు’’ అని ఆయన అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో అఖిలేశ్ ప్రసంగించారు. ‘‘మోదీ ప్రభుత్వం విమర్శలను భరించడం లేదు. తప్పుడు కేసులతో విపక్షాలను ఇరుకున పెడుతోంది. దర్యాప్తు సంస్థలను ఉసిగొప్పి కేసులు పెట్టిస్తోంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో మోదీ మాటలు ఓ మాట అన్నారు. బీజేపీ పర్కారుకు 400 రోజులే మిగిలి ఉన్నాయన్నాంటూ రోజులు లెక్కబెట్టుకున్నారు. ఈ రోజులతో కేంద్రానికి ఇక 399 రోజులే మిగిలాయి’’ అని అఖిలేశ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేప గద్దె దిగడం ఖాయమన్నారు.