ఎంపీపై కేసు.. కుంభకోణం కాదు, బర్రెను దొంగిలించాడని..  - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీపై కేసు.. కుంభకోణం కాదు, బర్రెను దొంగిలించాడని.. 

August 30, 2019

Samajwadi...

కేసులు, పోలీస్ స్టేషన్లు అనగానే మనకు చాలా సీరియస్‌ మ్యాటరే వుందని అనిపిస్తుంది. కానీ, ఈ కేసు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. అది కూడా ఓ ఎంపీపై ఇద్దరు సామాన్యులు కేసు పెట్టారు. ఇంతకీ ఆ కేసు ఏ కుంభకోణమో, మర్డర్ కేసో కాదు.. బర్రెను దొంగిలించారని ఆయనపై కేసు పెట్టారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరనుకుంటున్నారూ.. సమాజ్‌వాదీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాంపూర్ ఎంపీ ఆజమ్ ఖాన్‌‌. 

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ బర్రె దొంగతనం కేసు నమోదైంది. దీనిపై కేసు‌ నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. ఆ కేసు పెట్టినవారు రాంపూర్‌కు చెందిన అసిఫ్‌, జాకీర్‌ అనే ఇద్దరు వ్యక్తులు. 2016 అక్టోబరు 15న తన అనుచరులతో కలిసి రాంపూర్‌లోని తన ఇంటిని ఆజంఖాన్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇల్లు ధ్వంసం చేయడమే కాకుండా ఇంటి ఆవరణలో వున్న గేదెను, దాంతోపాటు రూ.25 వేల నగదును కూడా దోచుకుపోయారని ఆరోపించారు. 

ఇంటి స్థలాలన్ని ఇవ్వాలంటూ ఎంపీ అనచరులు తమపై దాడికి పాల్పడ్డారని తెలిపారు.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుపెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంపీ ఆజమ్‌ ఖాన్‌తో పాటు మాజీ అధికారి అలయ్‌ హసన్‌ పేర్లను అందులో చేర్చారు. మరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. కాగా, ఈ కేసుపై ఆజంఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి అని సోషల్ మీడియాలో అంటున్నారు.