మధురవాణిగా సమంత.. మహానటి కోసం - MicTv.in - Telugu News
mictv telugu

మధురవాణిగా సమంత.. మహానటి కోసం

April 6, 2018

అలనాటి ప్రఖ్యాత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న’మహానటి’ చిత్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు, క్రిష్, విజయ్ దేవరకొండ, సమంత వంటి దిగ్గజాలు కూడా నటిస్తున్నారు. జర్నలిస్టు మధురవాణిగా నటిస్తున్న సామ్ తన గెటప్‌ను విడుదల చేసింది. చాలాకాలం కిందటి విషయాల కోసం సీరియస్‌గా అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘నా పేరు .. కన్యాశుల్కంలో సావిత్రిగారి పేరే .. మధురవాణి’ అంటూ పోస్టర్ ద్వారా ఈ పాత్రను పరిచయం చేసింది సామ్.‘ఇలాంటి అద్భుతమైన సినిమాలో నేను కూడా భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ‘మధురవాణి’ పాత్ర పోషించడం ఎంత నచ్చిందో.. అంతగా మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేసింది. ముక్కు పుడక, పొడవు జడ, పూల చొక్కా, పెద్ద కళ్లద్దాలతో పాతకాలం నాటి అమ్మాయిలా ఉంది సామ్. చుట్టూ వార్తాపత్రికలు ఉన్నాయి. ఈ పాత్రకు సామ్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది.

సావిత్రి కూడా కన్యాశుల్కం సినిమాలో మధురవాణి అనే పాత్రను పోషించింది. అయితే అది జర్నలిస్టు పాత్రకాదు. మహానటికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన సమంత చిత్రం ‘రంగస్థలం’ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.