సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి అంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూయర్ విషెస్ చెప్పింది టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత. మీరు చేయగలిగిన వాటినే నియంత్రించండి. కొత్త, సులభమైన లక్ష్యాల కోసం ఇదే సరైన సమయం అంటూ తన ఇనస్టాలో పోస్ట్ పెట్టింది. ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉంటాయి అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శామ్ ఒంట్లో బాగా లేనందువలన ఈ మధ్య దూరంగా ఉంటోంది. కానీ ఇప్పుడు రెండు రోజుల ముందరే న్యూయర్ విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టింది.
శామ్ పోస్ట్ కు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ప్రముఖులు కూడా తిరిగి విషెస్ చెబుతున్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగారు. మయోసైటిస్ కారణంగా ప్రస్తుతం సినిమాలు కూడా చేయకుండా విశ్రాంతి తీసుకుంటోంది. తన ఆఖరు చిత్రం యశోద. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వకపోయినా మంచి టాక్ ని అయితే తెచ్చుకుంది.