Home > Featured > మామ బర్త్‌డేలో కోడలు ప్రత్యేకం.. డ్రెస్‌ ధర ఎంతంటే..

మామ బర్త్‌డేలో కోడలు ప్రత్యేకం.. డ్రెస్‌ ధర ఎంతంటే..

Samantha Akkineni....

మామ పుట్టినరోజును కోడలే అందరికన్నా ఎక్కువ ఆనందంగా జరుపుకుందా అనిపించింది నటి సమంత. బార్బీ పింక్ కలర్ డ్రెస్‌లో మరింత అందంగా మెరిసింది. తన మామయ్య అక్కినేని నాగార్జున 60వ పుట్టినరోజు సందర్భంగా సమంత కొత్తగా కనువిందు చేసింది. గురువారం జరిగిన ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగ్ కుటుంబం అంతా కలిసి ఐబిజా ట్రిప్‌కు వెళ్లారు. నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, అఖిల్‌లు కలిసి వెళ్లారు. అక్కడే ఆయన తన పుట్టినరోజును కుటుంబ సభ్యుల నడుమ జరుపుకున్నారు.

Samantha Akkineni....

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన బర్త్‌డే పార్టీలో సామ్‌ ప్రత్యేకమైన లుక్‌లో మెరిసింది. పార్టీ కోసం ఆమె వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్‌, విలువైన కాస్ట్యూమ్స్‌ ధరించారు. ఆ డ్రెస్ ధర రూ.2 లక్షలు వుంటుందని సమాచారం. ఆ ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. డ్రెస్ చాలా బాగుంది అని సమంత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే సమంత నటించిన ‘ఓబేబీ’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఇందులో శర్వానంద్‌ కథానాయకుడు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Updated : 30 Aug 2019 11:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top