మాధవన్‌తో సమంత..మహారాణిగా అదరగొట్టింది - MicTv.in - Telugu News
mictv telugu

మాధవన్‌తో సమంత..మహారాణిగా అదరగొట్టింది

January 17, 2020

nhbg

నటిగా బిజీగా ఉన్న సమంత అప్పుడప్పుడు టీవీ ప్రకటనల్లో కూడా నటిస్తుంటారు. తాజాగా ఓ కాఫీ బ్రాండ్ ప్రకటనలో నటించారు. ఇందులో సమంత భర్తగా నటుడు మాధవన్ నటించారు. ఈ తమిళ యాడ్‌లో సమంత ఎరుపు రంగు చీర కట్టుకుని మహారాణిగా నటించారు. దీనికి సంబందించిన వీడియోను ఆ కాఫీ బ్రాండ్ కంపెనీ ట్విట్టర్‌లో పోస్ట్ అది వైరల్ అవుతోంది. 

మహారాణిగా సమంత బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రకటన త్వరలో టీవీల్లో రానుందని ఆ కాఫీ బ్రాండ్ యాజమాన్యం తెలిపింది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ‘జాను’ సినిమాలో నటిస్తున్నారు. తమిళంలో మంచి విజయం సాధించిన ‘96’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. ఇందులో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో పాటు సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ సీజన్ 2లోనూ నటిస్తున్నారు.