Samantha buys house where she used to live with Naga Chaitanya, says producer Murali Mohan
mictv telugu

చైతూతో కలిసి ఉన్న ఇంటినే మళ్లీ కొన్న సమంత

July 29, 2022

సమంత, నాగచైతన్య గురించి ఎలాంటి వార్త వచ్చినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. వారి విడాకుల వార్తల నుంచి ఆ తర్వాత వారు విడివిడిగా ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాయి. తాజాగా సమంత నివసిస్తున్న ఇంటి గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ సంచలన విషయం బయట పెట్టారు. తమ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంటిని చైతన్య ఇష్టపడి కొనుగోలు చేశాడని.. పెళ్లైన వెంటనే సమంతతో కలిసి అక్కడే ఉన్నాడని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఆయన తెలిపారు. విడాకుల అనంతరం వాళ్లిద్దరూ ఆ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్లిపోయారని.. కానీ, ఇటీవల సామ్‌ మళ్లీ అదే ఇంటిని ఎక్కువ డబ్బు చెల్లించి మరీ కొనుగోలు చేసిందని ఆయన వివరించారు.

పెళ్లయిన తర్వాత సమంత, నాగచైతన్యలు.. ఇద్దరూ కలిసి కొత్త కాపురం కోసం ఆ ఇంటికి కావలసిన ఏర్పాట్లన్నీ తమ అభిరుచికి అనుకూలంగా మలుచుకున్నారని చెప్పారు. అంతా సాఫీగా జరిగిపోతుందనుకుంటున్న సమయంలోనే అవాంతరాలు, కుటుంబ కలహాలు, విడిపోవడాలు జరిగిపోయాయన్నారు. విడిపోయిన రోజు చైతన్య.. తన సామానంతా తీసుకుని వెళ్లిపోయాడని, సామ్‌ కూడా కొన్నిరోజుల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. ఆ తర్వాత మరో ఇంటి కోసం సామ్‌ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో వెతికిందని, మళ్లీ తిరిగి తన వద్దకే వచ్చిందని చెప్పారు.

సెక్యూరిటీ ఎక్కువగా ఉండటమే కాక ఈ పెంట్ హౌస్ తో ఇంకెవరితో ఇబ్బంది ఉండదని, ఒకసారి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంటే తానంతట తాను బయటకు వచ్చేవరకు ఇబ్బంది ఉండకపోవడంతో సమంత అంత డబ్బు వెచ్చించిందని అలా ఆమె ఆ ఇంటిని కొనుగోలు చేసిందని అంటున్నారు. ఈ ఇంట్లో ప్రస్తుతం సమంత తో పాటు ఆమె తల్లి మాత్రమే నివసిస్తున్నారని తాజాగా మురళీమోహన్ వెల్లడించారు. ఈ వార్తలు ఇప్పుదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.