టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్య అనుహ్యంగా విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడాకుల ప్రకటన చేయడంతో అటు అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. ఎప్పుడూ సరదగా కనిపించే ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు. విడిపోయిన తర్వాత వీరిద్దరు ఎవరికీ వారు సినిమాలతో బిజీగా మారిపోయారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తాను విడాకుల సమయంలో రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై కూడా స్పందించింది.
సమంత మాట్లాడుతూ.. “విడాకులు తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. అది అంత సామరస్యంగా జరగలేదు. ప్రస్తుతం బాగానే ఉంది. గతంలో కంటే ఎక్కువ బలంగా ఉన్నాను ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ…” వాటిని చూసి మొదట షాక్ అయ్యాను. ఆ వార్తలు చూసి ఎవరైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు మా ఇంటికి వచ్చి, దాడులు చేసి.. అవన్నీ అవాస్తవాలని చెబితే బాగుండు అని ప్రతి రోజూ ఎదురుచూసేదాన్ని” అని తెలిపింది. భవిష్యత్తులో తాను ప్రేమలో పడే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలసి సమంత ఇచ్చిన ఇంటర్వ్యూ ‘డిస్నీ ప్లస్ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నాగచైతన్యతో విడాకులతో పాటు చాలా విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.