Samantha climbs 600 steps at Palani Murugan temple as she recovers from Myositis
mictv telugu

సమంత ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆరోగ్యం కుదుటపడింది

February 14, 2023

Samantha climbs 600 steps at Palani Murugan temple as she recovers from Myositis

వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. తన ఆరోగ్యం నార్మల్ స్థితికి చేరుకున్న వెంటనే సమంత తన తదుపరి చిత్రాల షూటింగ్స్, ఇతర కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్లు చేస్తూ కనిపించింది. జిమ్ ఎక్విప్ మెంట్ ను ఉపయోగించుకుని సమంత భుజాలతో స్క్వాట్స్ చేస్తూ ఆ వీడియోలో కనిపించింది. గత ఏడాది మయో సైటిస్ వ్యాధికి గురైన సమంత ఇప్పుడు దాదాపు కోలుకున్నట్లు తెలుస్తుంది.

మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత మొక్కు తీర్చుకునేందుకు సమంత తమిళనాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించింది. అరుళ్ ముగు శ్రీ దండాయుధపాణి స్వామి క్షేత్రం అని పిలువబడే ఈ ఆలయాన్ని దర్శించాలంటే 600 మెట్లు ఎక్కాలి. సమంత 600 మెట్లు ఎక్కడం మాత్రమే కాదు.. మెట్టు మెట్టుకూ కర్పూరం వెలిగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. సమంత టీంతో పాటు.. జాను (తమిళంలో 96) చిత్ర దర్శకుడు సి ప్రేమ్ కుమార్ కూడా సమంత దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. వ్యాధితో బాధపడుతున్న సమయంలో కండరాల నొప్పితో బాధపడుతున్నానని, కనీసం నిల్చోడానికి కూడా ఓపిక ఉండటం లేదని చెప్పింది. ఇప్పుడు 600 మెట్లు ఎక్కిందంటే ఆరోగ్యం పూర్తిగా కుదుటపడినట్లేనని తెలుస్తోంది.

సమంత కర్పూరం వెలిగిస్తూ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఫొటోల్లో సింపుల్ గా సల్వార్ కమీజ్ డ్రెస్ ధరించి, మాస్క్ పెట్టుకుని కనిపిస్తోంది. ఇదిలా ఉండగా సమంత పౌరాణిక చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14కి వాయిదా పడింది. ఆలాగే సమంత విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించాల్సి ఉంది.