samantha cries while talking about her health condition with anchor suma
mictv telugu

ఇంకా చనిపోలేదు.. సమంత సంచలన వ్యాఖ్యలు.. చలించిపోయిన యాంకర్ సుమ

November 8, 2022

విడాకుల వివాదాలని జయించి సినీ కెరీర్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తుంది అని అనుకుంటే.. తన భయంకర వ్యాధి మయూసైటిస్ గురించి ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది సమంత. ఇండస్ట్రీలో సమంత జబ్బు గురించి తెలుసుకుని ప్రముఖులంతా సంఘీభావం వ్యక్తం చేశారు. సమంత అభిమానులని తీవ్ర భావోద్వేగానికి గురిచేసిన ఈ మయూసైటిస్ వ్యాధి గురించి తొలిసారి ఇంటర్వ్యూలో వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది సామ్. యశోద మూవీ ప్రమోషన్స్ లో యాంకర్ సుమతో జరిగిన ఇంటర్వ్యూ లో భాగంగా తన వ్యాధి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన సుమ సైతం భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత సుమల ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. నవంబర్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సమంత సుమతో మాట్లాడుతూ.. తన అనారోగ్య పరిస్థితి గురించి పోస్టులో పెట్టిన విధంగానే.. జీవితంలో కొన్ని మంచి రోజులు, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయని పేర్కొంది. ఇప్పుడు అందరు తానొక ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నట్టు చనిపోతుంది అని రాస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తప్పుడు వార్తలు రాయొద్దు. అయితే నేను ఆ చెడ్డ రోజులని అధిగమించాను. ఒక్కోరోజు అయితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. ఇక అంత అయిపోయింది అన్న అయోమయం అంటూ కన్నీరు పెట్టుకుంది సమంత. అయితే నేనిక్కడ ఫైట్ చేయడానికి ఉన్నానని సమంత పేర్కొంది. ఈ సందర్భంగా సుమా మాట్లాడుతూ మీరంటే నాకు చాలా ఇష్టం అని నేను గత కొన్నేళ్లుగా మన ప్రయాణంలో చూస్తూనే ఉన్నాను ఇప్పుడంటే బయటకు చెప్పారు.. కానీ మీరు బయటపెట్టని సమయంలో నొప్పితో మీరు ఎంత బాధపడి ఉండేవారో అంటూ సుమ సైతం భావోద్వేగం అవ్వగా.. జీవితంలో నేనే కాదు మనుషులంతా ఒకానొక సమయంలో ఈ పరిస్థితులని ఎదుర్కొంటారు అని సమంత చెప్పుకొచ్చింది.