ఎట్టకేలకు సమంత మోస్ట్ ఎవైటింగ్ మైథలాజికల్ డ్రామా శాకుంతలం ట్రైలర్ విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వంలో దేవ్ మోహన్ హీరోగా.. అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో తెరకెక్కిన శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరుగగా.. చాలారోజులకి మీడియాని అడ్రెస్ చేసింది సమంత. ఈ కార్యక్రమానికి సమంత, నీలిమ గుణ, గుణశేఖర్, దిల్ రాజు, హీరో దేవ్ మోహన్ హాజరయ్యారు. ట్రైలర్ లో సమంతని అందంగా చూపిస్తూనే ఎమోషనల్ సీన్స్ ని ఎలివేట్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో సమంత నటన నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇక దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం మూవీ హైలైట్స్ చెప్తున్న క్రమంలో సమంత భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. పదే పదే కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది.
దేవ్ మోహన్ హీరో అయినా.. సమంత శాకుంతలం చిత్రానికి రియల్ హీరో అని గుణశేఖర్ చెప్పగానే వేదిక అంత అరుపులు ఈలలతో దద్దరిల్లింది. పేద ఎత్తున సమంత అభిమానులు చప్పట్లు కొడుతూ కేకలు వేశారు. దాంతో ఎమోషన్ ఆపుకోలేకపోయిన సమంత బోరున ఏడ్చేసింది. గుణశేఖర్ స్పీచ్ ఆద్యంతం ఎమోషనల్ గా ఇవ్వగా.. అదే స్థాయిలో సమంత ఏడుస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి చెప్పొచ్చు.. శాకుంతలం చిత్రం సమంతకి ఎంత స్పెషలో. గుణశేఖర్ మాట్లాడుతూ నాలాంటి ఫిలిం మేకర్స్ ఎంతో మంది ఉంటారు. కానీ దిల్ రాజు లాంటి నిర్మాత ఉంటేనే ఇలాంటి చిత్రాలు సాధ్యం అవుతాయని గుణశేఖర్ సైతం కన్నీళ్లని ఆపుకోలేకపోయారు.