తెగింపు, వారసుడు వంటి మరికొన్ని తెలుగు చిత్రాలతో పాటు ఈ ఏడాది టాలీవుడ్ నుండి వస్తున్న మరో బహుభాషా చిత్రం ‘శాకుంతలం’. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ పౌరాణిక చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన కాళిదాసు సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో సమంత టైటిల్ పాత్రలో నటిస్తుండగా, దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో నటించారు. ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరుగగా.. చాలారోజుల తరువాత మీడియా ముందుకు హాజరైంది సమంత. అనుకోని అనారోగ్యం బారిన పడడంతో సమంత బయటకు రావడం లేదు. అప్పుడెప్పుడో యశోద ప్రమోషన్స్ లో మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత ఇన్నాళ్లకు ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హాజరై ఫ్యాన్స్ ని అలరించింది.
అయితే ఎందుకో కానీ సమంత అంత యాక్టివ్ గా అయితే అనిపించలేదు. మోహంలో తెలియని బెరుకు, అయోమయం స్పష్టంగా కనిపిస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. నవ్వులో సహజత్వం అసలు లేదని.. మాటికీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతుందని.. లోపల ఏదో ఒక విషయం పట్ల తీవ్రంగా చింతిస్తున్నట్టు సమంత మోహంలో స్పష్టంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి వచ్చే ముందు కూడా సమంత డల్ గా ఎంట్రీ ఇచ్చిందని.. కనీసం నడవలేని స్థితిలో.. సహాయకుడి చేయి పట్టుకుని సమంత వేదిక ఎక్కిందని.. బయట టాక్ ఉన్నట్టు సమంత ఆరోగ్యం నిజంగానే క్షిణిస్తుందా అన్న అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత వ్యక్తిగత అంశాలు పక్కనపెడితే.. ఓవరాల్ గా సమంత ఎమోషనల్ పెర్ఫామెన్స్, అద్భుతమైన గ్లామర్ లుక్ ని శాకుంతలం ట్రైలర్ లో చూడొచ్చు. విజువల్స్ కూడా బావున్నాయి. చివర్లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ.. భరతుడి పాత్రలో ఇచ్చే ఎంట్రీ అదుర్స్ అనే చెప్పాలి.