samantha flying to south korea for better treatment
mictv telugu

సమంత కండిషన్ సీరియస్.. దక్షిణ కొరియాకి తరలింపు ?

December 1, 2022

యశోద ప్రమోషన్స్ లో తన మయోసైటిస్ వ్యాధి గురించి రివీల్ చేసి అందరికి షాక్ ఇచ్చింది సమంత. అప్పటివరకు ఆమెపై ఉన్న నెగిటీవ్ కథనాలన్నీ ఒక్కసారిగా పోయి సింపతీ వేవ్ ఎగిసింది. ఇండస్ట్రీ పెద్దలంతా సమంతకి సంగీభావం ప్రకటించారు. తాను ఇంకా చనిపోలేదు.. పోరాడతా అంటూ కూడా అప్పట్లో సమంత చేసిన ఎమోషనల్ కామెంట్స్ కలకలం రేపాయి. అప్పుడు సామ్ చెప్పినట్టుగానే మయోసైటిస్ పై తీవ్రంగా పోరాడుతుంది సమంత. ఈ మయోసైటిస్ జబ్బు లక్ష మందిలో ఒక్కరికి వచ్చే ప్రాణాంతక వ్యాధి అని అందరికి తెలిసిందే. నిలబడితే అలసట, నడుస్తే కిందపడిపోవటం, మోకాళ్లు, మోచేతులకు విపరీతంగా నొప్పి ఈ వ్యాధి లక్షణాలు. అయితే ఇప్పటికే ఇంగ్లిష్ మెడిసిన్స్ తో సమంత ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కానీ అవి పెద్ద పని చేయటం లేదని తెలుస్తుంది.

దాంతో సామ్ కండిషన్ సీరియస్ అని, హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిందని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ వదంతులే అని కొట్టిపారేసింది సమంత టీమ్. అయితే ఆ కొద్ది రోజులకే సమంత ఇంగ్లీష్ మందులు కాకుండా ఆయుర్వేద వైద్యం తీసుకోనుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చిన సమంత వైద్యం కోసం మరికొద్ది రోజుల్లో దక్షిణ కొరియాకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోగా.. విషమించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో.. ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ కోసం సమంతని ఆమె తల్లిదండ్రులు దక్షిణకొరియాకి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడే కొన్ని రోజుల పాటు సమంత ఉండనుందని తెలుస్తుంది.