ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన జంట నాగచైతన్య- సమంతల మధ్య ఏం జరిగిందో ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. రకరకాల రూమర్లు రాగా, అభిమానులు ఏవేవో ఊహించుకున్నారు. ఇద్దరూ కూడా కారణం ఇదీ అని చెప్పలేకపోయారు. దాంతో ఆ వ్యవహారం అలా పెండింగులో ఉండిపోయింది. అయితే విడాకులపై తాజాగా సమంత నోరు విప్పినట్టు సమాచారం.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ అనే షో చేస్తున్నారు. మొదటి భాగం విజయవంతం కాగా, రెండో భాగం ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షోలో పాల్గొన్న సమంత విడాకులపై కరణ్ అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబిచ్చిందనే విషయం బయటకు పొక్కింది. విడాకులకు దారి తీసిన పరిస్థితుల గురించి సమంత వివరంగా చెప్పేసిందంట. దాంతో ఈ షో ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా? అని సినీ జనాలతో పాటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. కాగా, సమంత ఎపిసోడ్ త్వరలో రిలీజవుతుందని బాలీవుడ్ జనాలు అంటున్నారు.