Samantha Grandmother Looks Raising New Doubts In Fans
mictv telugu

భయంకరంగా మారిన సమంత చర్మం ?

November 10, 2022

సెలబ్రెటీల జీవితాల్లో మనం ఊహించని రహస్యాలు ఉంటాయి. అవి ఎప్పుడో కానీ బయటపడవు. వ్యక్తిగత జీవితాన్నిసాధ్యమైనంత సీక్రెట్ గా పెట్టుకునే స్టార్స్.. ఫ్యాన్స్ కి చెప్పాలి అనిపించినప్పుడే ఓపెన్ అవుతారు. అయితే సోషల్ మీడియా కారణంగా కాస్త ముందుగానే లీక్స్ వస్తున్నాయి. సమంత విడాకుల విషయాన్నీ ముందుగానే పసిగట్టిన సోషల్ మీడియాలో.. చాలా రోజులుగా సమంతకి మయోసైటిస్‌ అనే భయంకర వ్యాధి ఉందని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. సమంతనే చెప్పేవరకు ఇది ఎవ్వరికి తెలియదు. యశోద డబ్బింగ్ ని సెలైన్ పెట్టుకుని చెప్తున్న ఫోటోని పోస్ట్ చేయటంతో విషయం తీవ్రత అర్థమైంది. తీరా అసలు ఏంటీ ఈ మయోసైటిస్‌ అని లోతుగా సెర్చ్ చేస్తే.. ప్రాణాంతక వ్యాధి అని, లక్షల్లో ఒక్కరికి వచ్చే జబ్బని భయంకర నిజాలు తెలిసాయి. దీంతో సమంతపై కుప్పలుతెప్పలుగా గాసిప్స్ గుప్పుమన్నాయి. ఒకానొక స్టేజి లో అయితే సమంత ఇక మనకి లేదంటూ కూడా వార్తలొచ్చాయి.

దీంతో సామ్ మీడియా ముందుకొచ్చి నేనింకా బ్రతికే ఉన్నాను.. కానీ వ్యాధి తీవ్రత తగ్గట్లేదు అని చెప్పుకొచ్చింది.

అయితే సమంత ఇంటర్వ్యూస్ వైరల్ అవుతున్న సమయంలోనే.. ఒక షాకింగ్ పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మయోసైటిస్‌ వ్యాధిలో ప్రమాదకరమైంది వృద్ధాప్య లక్షణాలు. కండరాలు బలహీనపడి చర్మంపై ముడతలు రావటం ప్రారంబిస్తాయట. అయితే ఈ లక్షణాలకు సరిపడే విధంగా ప్రస్తుతం సమంత ముసలి ముడుతలతో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. మయోసైటిస్ వ్యాధి కారణంగా బలహీనంగా మారిపోయిన సమంత ఫొటో చూసిన అభిమానులు.. ఏంటి సమంత ఇలా అయిపోయింది? అంటూ బాధపడిపోతున్నారు. ఆమె ధరించిన కళ్లద్దాలు, ఉంగరాలు, ఫింగర్స్‌ని క్రాస్ చేయడంతో అరచేతికి పడిన మడతలు చూసిన కొంత మంది నెటిజన్లు.. 80 ఏళ్ల భామ్మలా సమంత ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది సమంత సినిమా గెటప్ అయి ఉంటుందని.. ప్రమోషన్స్ కోసం సామ్ ఈ పిక్ ని రిలీజ్ చేసుంటుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి.