స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది. మయోసైటిస్ అనే కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని ఇప్పుడు న్యూ నార్మల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చికిత్సలో భాగంగా నెలకోసారి ఐవీఐజీ (ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరపీ) చికిత్సను ఇంట్లోనే తీసుకుంటున్నానని, దానికి రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతోందని తెలిపింది. శరీరంలో వీక్ అయిన ఇమ్యూనిటీ సిస్టంను సమర్ధవంతంగా పని చేయించడంతో పాటు వేరే వ్యాధుల వల్ల ఇన్‌ఫెక్షన్ రాకుండా ఈ థెరపీ ఉపయోగపడుతుందని వివరించింది. అయితే ఒకవైపు చికిత్స తీసుకుంటున్నా వ్యాయామాన్ని మాత్రం వదలడం లేదు సమంత. ఇంట్లోనే జిమ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను రివీల్ చేసింది. కాగా, సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇటీవలే బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగులో పాల్గొంది. ఇందులో ఆమెతో పాటు వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. ఫ్యామిలీమాన్ సిరీస్ దర్శకులు రాజ్ డీకేలు దీన్ని తెరకెక్కిస్తున్నారు.