Samantha hits back at a troller who said "she will die alone..."
mictv telugu

సమంత చావాలన్న నెటిజన్.. ఆమె సమాధానం ఇదీ..

May 27, 2022

Samantha hits back at a troller who said "she will die alone..."

పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‏తో ఓ ఊపు ఊపేసిన సమంత.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. సామ్ నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు యశోద సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది సామ్. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన పెంపుడు జంతువులతో దిగిన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది సమంత.. అయితే అది చూసిన ఓ నెటిజన్ ఆమెపై షాకింగ్ కామెంట్ చేశాడు.

స‌మంత ఇలానే కుక్కలు, పిల్లుల‌తో చావాల్సిందేనంటూ కామెంట్ పెట్టాడు. దానికి స‌మంత కూడా త‌న‌దైన స్టైల్లోనే రెస్పాన్స్ ఇచ్చింది. ఒకవేళ అదే జ‌రిగితే నేనెంతో అదృష్ట‌వంతురాలిగా భావిస్తాను అంటూ స‌మాధానం ఇచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన సమంత ఫ్యాన్స్ సదరు నెటిజన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.