samantha injured in yashoda movie action sequence
mictv telugu

నా మొహం మీద దారుణంగా కొట్టారు.. సమంత షాకింగ్ కామెంట్స్

November 8, 2022

మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే సమంత తాజా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నవంబర్ 11న తన యశోద మూవీ విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది సామ్. ఈ నేపథ్యంలో స్టార్ యాంకర్ సుమ సామ్ ని ఇంటర్వ్యూ చేయగా.. తన భయంకర వ్యాధి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది సమంత. ఒకానొక సమయంలో అడుగు కూడా ముందుకు పెట్టలేని పరిస్థితి.. అంత అయిపోయింది అనుకున్నా.. కానీ నేను లైఫ్ లో ఫైట్ చేయడానికి ఉన్నా.. నెమ్మదిగా కోలుకుంటున్న అని చెప్పింది సామ్. ఇక మీడియాలో కొందరు నేను చనిపోయానని రాస్తున్నారు, నేనింకా బ్రతికే ఉన్నా.. తప్పుడు వార్తలు రాయొద్దు .. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివి సహజం అని చెప్పింది సమంత. ఇక యశోద మూవీ డబ్బింగ్ లో సమంత కష్టాలని వివరించారు దర్శకుడు. ఆసుపత్రి బెడ్ పై సెలైన్ పెట్టుకుని సమంత డబ్బింగ్ చెప్పినట్టు పేర్కొన్నారు.

ఇక యశోద మూవీ విషయంలో తానూ కాన్ఫిడెంట్ గా ఉన్నానని.. అస్సలు టెన్షన్ పడొద్దని ఫిక్స్ అయినట్టు తెలిపింది సమంత. సహజంగా తానూ కథలని విన్న వెంటనే సమయం తీసుకుంటానని.. కానీ యశోద స్టోరీ వినగానే ఓకే చెప్పేసానని.. యదార్థ సంఘటనల నేపథ్యంలో యశోద కథ రాశామని చెప్పగానే ఒప్పుకున్నట్టు తెలిపింది. ఇక ఇప్పుడు డాన్సుల కంటే ఫైట్స్ చేయడానికే ఇష్టపడుతున్నాని.. యశోద యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తన మొహానికి దెబ్బలు తగిలాయని చెప్పింది. తాను యశోద మూవీలో రియలిస్టిక్‌గా స్టంట్లు చేశానని, ఓ సమయంలో తనకు మొహం మీద దెబ్బ తగిలిందని, పంచ్ పడిందంటూ చెప్పుకొచ్చింది. ఓ అర్దగంట అదే షాక్‌లో ఉండిపోయాను అని సమంత చెబితే.. ఆ తరువాత పళ్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూపించుకున్నారా? అంటూ సుమ కౌంటర్ వేసింది. సమంతకు యశోద సినిమా ఎలాంటి ఇమేజ్‌ను తీసుకొస్తుందో చూడాలి.