కేటీఆర్ పోస్ట్‌కు సమంత లైక్.. పోస్ట్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ పోస్ట్‌కు సమంత లైక్.. పోస్ట్ వైరల్

June 14, 2022

ఇన్స్టాగ్రామ్‌లో తాజాగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన ఓ పోస్ట్‌కు టాలీవుడ్ హీరోయిన్ సమంత లైక్ కొట్టింది. దాంతో ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేటీఆర్ చేసిన పోస్టుకు సమంత ఎందుకు లైక్ కొట్టింది? ఆ పోస్టులో కేటీఆర్ ఏం రాశారు? అనే విషయాలపై నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by KTR (@ktrtrs)

”దేశ జనాభాలో కేవలం 2.5 శాతం జనాభా మాత్రమే ఉండే తెలంగాణ, దేశ జీడీపీలో 5 శాతాన్ని అందిస్తోంది. (సోర్స్: ఆర్బీఐ రిపోర్ట్ అక్టోబర్ 2021). ఈ దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు. డబుల్ ఫలితాలను ఇచ్చే పాలన’ అని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ తాజాగా ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలతోపాటు, పలువురు నెటిజన్స్ పోస్ట్‌కు లైక్‌లు కొడుతూ, కామెంట్స్ చేశారు. అయితే, కేటీఆర్ చేసిన ఆ పోస్టుకు సమంత కూడా లైక్ కొట్టింది.

 

మరోపక్క సమంత.. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన కేరీర్‌పై వేగం పెంచింది. తెలుగు, హిందీ, తమిళంలో సినిమాలు చేస్తూ, బీజీ బీజీగా ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో సినిమాలు చేస్తూ, బాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా మోస్ట్ పాప్యులర్ పాన్ ఇండియా హీరోయిన్‌గా సమంత టాప్ పొజిషన్‌లో నిలిచారు. అంటే ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన పోస్టుకు ఆమె లైక్ కొట్టడంతో హాట్ టాఫిక్‌గా మారింది.