samantha myositis in third stage
mictv telugu

థర్డ్ స్టేజ్ లో మయోసైటిస్

November 22, 2022

మయోసైటిస్ ప్రకటన తరువాత సమంతపై మళ్ళీ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. సమంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఇటీవల విడుదలైన యశోద చిత్రం కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంది. ఆమె క్షేమంగా ఉందని ఆమె అభిమానులకు హామీ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం తన యశోద చిత్రంలో చేసిన నటి కల్పిక గణేష్ కూడా మయోసైటిస్ తో బాధ పడుతున్నట్టు తెలుస్తుంది. సమంత లానే తనకి మయోసైటిస్ ఉందని స్వయంగా వెల్లడించింది కల్పిక గణేష్. యశోద సక్సెస్ మీట్‌లో కల్పిక గణేష్ పాల్గొని తన వ్యాధిపై వ్యాఖ్యానించింది. సమంత లేకుండానే జరిగిన ఈ వేడుకలో కల్పిక మాట్లాడుతూ.. తనకు కూడా అదే అరుదైన వ్యాధి ఉందని చెప్తూ.. సమంత మయోసైటిస్ మూడో దశలో ఉందని.. ఈ దశలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. అందుకే సక్సెస్ మీట్ కి సమంత హాజరుకాలేదని క్లారిటీ ఇచ్చింది.

అయితే తనకి ప్రారంభ దశలో మయోసైటిస్ ఉందని చెప్పింది కల్పిక. “గత 13 ఏళ్లుగా స్పాండిలైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నాను. సమంత కు ఉన్న వ్యాధి నాక్కూడా వుంది. కాకపొతే నేను ఫస్ట్ స్టేజ్ లో ఉంటే.. ఆమె థర్డ్ స్టేజిలో వుంది. ఒకసారి ఆమెని కలిసి దీని గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని కల్పిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న కల్పిక గణేష్.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ మూవీలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.