Samantha opened her lips about divorce for the first time..that's why we broke up
mictv telugu

విడాకులపై పెదవి విప్పిన సమంత..కారణం అదేనట

July 22, 2022

టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకొని, సడన్‌గా ఎందుకు విడిపోయారో? ఇప్పటికి ఎవరికి పూర్తిగా తెలియదు. విడాకులకు కారణం ఏంటో కూడా సమంత, నాగచైతన్యలు ఎప్పుడు? ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో వారి విడాకుల ప్రస్తావన ఇప్పటికి రహస్యంగానే ఉంది. తాజాగా సమంత ఓ షోలో మొదటిసారిగా చైతన్యతో ఎందుకు విడాకులు తీసుకున్నానో మీకూ తెలుసా అంటూ, విడాకులకు గల కారణాలను వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు టాలీవుడ్‌తోపాటు సినీ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారాయి.

బాలీవుడ్‌లో మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో సమంత, అక్షయ్ కూమార్ పాల్గొన్నారు. ఈ షోలో ఆమె పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ”నేను, చైతన్య విడిపోవడం అంత సులభంగా జరగలేదు. మా మధ్య సఖ్యత లేదు. ఒకవేళ మా ఇద్దరిని ఓ గదిలో ఉంచితే, అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూడాలి” అనగానే వెంటనే కరణ్ జోహార్..”నీ భర్త నుంచి విడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు?” అని అడిగారు. దానికి సమంత ” నా భర్త కాదు. నా మాజీ భర్త” అని అనండి అంటూ ఆమె ఘాటుగా సమాధానమిచ్చింది.

అనంతరం సమంత మాట్లాడుతూ.. “మేమిద్దరం విడిపోవడం సులభంగా జరగలేదు. విడిపోయిన సమయంలో మనోవేదనకు గురయ్యా. ప్రస్తుతం ఆ బాధ నుంచి బయటపడ్డా, మునుపెన్నడూ లేనివిధంగా దృడంగా సిద్ధమయ్యా. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం లేదు. ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే అక్కడ ఎలాంటి పదునైన ఆయుధాలు, వస్తువులు లేకుండా చూసుకోవాలి. భవిష్యత్తులో మా మధ్య సఖ్యత వస్తుందేమో తెలియదు. మేమిద్దరం విడిపోయినప్పుడు నాపై నెగెటివ్ ప్రచారం జరిగింది. ఆ సమయంలో వాటిపై స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు కూడా లేవు. నేను ఓపెన్ గా ఉండాలనుకున్నా. అందుకే విడిపోయిన విషయాన్ని అందరితో చెప్పా. మేము విడిపోయిన కొన్ని రోజులకే ‘ఊ అంటావా’ సాంగ్ ఆఫర్ నాకు వచ్చింది. ఆ పాట నాకెంతో నచ్చింది. అందుకే అందులో యాక్ట్ చేశా. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తి చూపించడానికి ఈ పాట సరైందని, నాలాంటి స్టార్ సెలబ్రిటీ చెబితే తప్పకుండా అందరికీ చేరువవుతుందని భావించా” అని సమంత అన్నారు.