Samantha participated in the karan johar show with Akshay Kumar
mictv telugu

క్యూట్ వీడియో.. బాలీవుడ్ హీరోతో ఐటెం సాంగుకు స్టెప్పులేసిన సమంత

July 20, 2022

బాలీవుడ్‌లో పాపులర్ నిర్మాత కం దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం నార్త్‌లో బాగా ఫేమస్. ఇప్పుడు ఈ షోని దక్షిణాదిలో కూడా పాపులర్ చేయాలనే ఆలోచనతో సౌత్ సినిమా స్టార్లయిన సమంత, విజయ్ దేవరకొండలను ఇందులో పాల్గొనేలా చేశారు. మొదటగా సమంత ఎపిసోడ్ ఈ నెల 21న గురువారం టెలికాస్ట్ కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోను బుధవారం రిలీజ్ చేశారు. అందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో సమంత ఎంట్రీ ఇచ్చింది. మొదటగా, పుష్పలో పాపులర్ ఐటెం సాంగయిన ఊ అంటావా మావ, ఊఊ అంటావా మావ పాటకు అక్షయ్‌తో కలిసి స్టెప్పులేసింది. తర్వాత అక్షయ్‌ సమంతను ఎత్తుకొని షోలో ఎంట్రీ ఇస్తాడు.

ఈ సందర్భంగా చిలిపిగా అడిగిన ప్రశ్నలకు అంతే సరదాగా సమంత బదులిచ్చింది. ముఖ్యంగా ‘పెళ్లిలో అసంతృప్తికి మీరే కారణం’ అని సమంత చెప్పిన డైలాగు ఆసక్తిని పెంచుతోంది. అయితే దీనికి కారణాన్ని అప్పట్లో షో నిర్వాహకులు లీక్ చేశారు. కరణ్ తీసే సినిమాల్లో పెళ్లి చాలా బాగా సక్సెస్ అయినట్టు, జీవితంలో దంపతులు సుఖంగా ఉన్నట్టు చూపిస్తాడనీ, కానీ, నిజ జీవితంలో మాత్రం అలా ఉండదనే ఉద్దేశంతో సమంత అలా చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఎపిసోడ్ రిలీజయితే కానీ పూర్తిగా తెలియదు. కాగా, ఇందుకు సంబంధించిన ప్రొమోలు వైరల్ అవుతున్నాయి.