ఏమాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచయమైంది సమంత రుతు ప్రభు. ఇప్పుడు ఆ సినిమా విడుదలై 13యేండ్లు. దీనికి సంబంధించి సమంత ఎమోషనల్ పోస్ట్ చేసింది.
మొదటి సినిమాతోనే నటనతో, అందంతో ఆకట్టుకున్నది సమంత. కొన్ని రోజుల వరకు జెస్సీ అనే పిలిపించుకునేంతగా గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఏ మాయ చేశావే సినిమా విడుదలై 13 సంవత్సరాలైన సందర్భంగా సామ్ ఎమోషనల్ అయింది.
పూల బొకేతో పోస్ట్..
నటి తన కెరీర్, జీవితం రెండింటినీ ప్రతిబింబించేలా ఒక పోస్ట్ చేసింది. ‘నేను పెద్దయిపోయానేమో అనిపిస్తున్నది. నేను మరింత దూరం ప్రయాణించాలి. ప్రతి రోజు నాకొక కొత్త రోజు. అది తెచ్చే మంచి విషయాలకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను ప్రభావితం చేసిన విషయాలు, బాధపెట్టిన విషయాలు ఉన్నాయి. ఇక నుంచి వాటిని అలా జరుగదు. కేవలం ప్రేమ, కృతజ్ఞతతో మాత్రమే ముందుకు సాగుతున్నా’ అంటూ సామ్ ఒక పూల బొకే ఫోటోను పోస్ట్ చేసింది.
వైరల్ గా..
సినీ ఇండస్ట్రీలో 13 యేండ్లు సక్సెస్ గా పూర్తి చేసుకున్నందుకు పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అందులో రాహుల్ రవీంద్రన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతున్నది. దానికి పసుపు డ్రెస్ లో ’14 సంవత్సరాల క్రితం మా టెర్రస్ మీద క్లిక్ చేశాను’ అంటూ ఫోటో షేర్ చేశాడు. అందులో సమంత చాలా ముద్దుగా కనిపిస్తున్నది. ప్రస్తుతం సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటీడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నది.