సమంత ఏం చేసినా వార్తే. నవ్వినా వార్తే, ఏడ్చినా వార్తే. తిట్టినా వార్తే, మౌనంగా ఉన్నా వార్తే. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సామ్‌కు ఏమైనా అయితే? అభిమానుల బాధ మాటల్లో చెప్పలేం. కేవలం అభిమానులే కాదు, ఆమెపై ప్రేమ పెంచుకున్న మూగ జీవాల పరిస్థితి కూడా అంతే. కండరాల బలహీనతతో బాధపడుతున్న సమంతకు ఇప్పుడు అవే తోడయ్యాయి. సమంత పెంచుకుంటున్న బుల్డాగ్ ఒకటి ఆమె వీపుపై కాలు వేసి ఓదార్చుతున్న ఫొటో ఒకటి బయటికొచ్చింది. సమంతనే దీన్ని ఇస్టాలో పోస్టింది.
‘బాధపడకు మమ్మీ నీ వెనుక నేనున్నా’ అని క్యాప్షన్ పెట్టింది. సోఫాలో బోర్లాపడుకున్న సమంత వెనకాలో మరో నల్ల కూడా కూర్చుని ఆమెకు తోడు అన్నట్లు పోజు కొడుతోంది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుండడం తెలిసిందే. సింగపూర్‌లో చికిత్స చేయించుకుని ఇటీవలే తిరిగొచ్చింది. ఆమె తాజా చిత్రం ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సామ్ శకుంతలగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు.