చైతూని తలచుకున్న సమంత.. ఇన్‌స్టాలో పోస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

చైతూని తలచుకున్న సమంత.. ఇన్‌స్టాలో పోస్ట్

April 5, 2022

టాలీవుడ్ బెస్ట్ జంట నాగ చైతన్య, సమంతలు గత సంవత్సరం తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. వీరి నిర్ణయంతో అభిమానులు, ఇండస్ట్రీ వాళ్లు చాలా షాకయ్యారు. ఆ తర్వాత చాలా రోజులు వీరి గురించే ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం సమంత తన ఇన్‌స్టాగ్రాం అకౌంటులో చైతూకి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేసేసింది. చైతూ మాత్రం అలాగే ఉంచేసుకున్నాడు. విడాకుల తర్వాత ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పారు కానీ, ఆ దిశగా ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు సడెన్‌గా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. వీరిద్దరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘మజిలీ’ చిత్రం విడుదలై నేటికి మూడేళ్లయింది. ఈ సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ఈ పరిణామంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ సినిమాలోలాగా ఒకరినొకరు అర్ధం చేసుకొని మళ్లీ కలుసుకోండని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఓ సినిమా చేస్తారని వినికిడి.