Samantha Ruth Prabhu apologises to Vijay Deverakond fans,
mictv telugu

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన సామ్

February 1, 2023

Samantha Ruth Prabhu apologises to Vijay Deverakond fans,

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా వేదికగా సమంత క్షమాపణలు చెప్పింది. అందుకు కారణం.. ‘ఖుషి’ సినిమా షూటింగ్‌ను కాదని ఆమె ముంబయి వెళ్లడమేనని టాక్. దీంతోనే విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సమంతపై ఫైర్ అయ్యారు. దీంతో సామ్.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెబుతూ ట్వీట్ చేసింది.

సమంత తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం సిటాడెట్ వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గోంటున్నట్లు ఓ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇది చూసిన నెటిజన్స్ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకు మాత్రం డేట్స్ ఇవ్వవు కానీ.. వెబ్ సిరీస్ కోసం ఇస్తావా… ఇక్కడి ప్రోడ్యూసర్స్‌కు ఎంత నష్టం వస్తుందో తెలియదా.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఖుషి పరిస్థితేంటి? అని అడిగాడు. దీనికి సామ్‌ స్పందిస్తూ.. “ఖుషి త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు నా క్షమాపణలు.” అంటూ ట్వీట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్, డైరెక్టర్ శివ నిర్వాణకు కూడా ట్యాగ్ చేసింది. అయితే ప్రస్తుతం ముంబై వెళ్లిన సమంత సిటాడెల్ వెబ్ సిరీస్‌ షూటింగ్ కోసం కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు అక్కడే ఉండొచ్చని సమాచారం. అంటే అప్పటివరకు సమంత హైదరాబాద్ వచ్చే అవకాశమే లేదు. అందులోనూ ‘శాకుంతలం’ రిలీజ్ కూడా ఎలాగో వాయిదా పడింది కనుక సమంతకు ప్రమోషన్స్ కూడా ఇప్పుడు లేవు. ఇలాంటి టైమ్‌లో విజయ్ సినిమాను కాదని సమంత.. ముంబయి వెళ్లడంతో రౌడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. పోనీ కనీసం ‘ఖుషి’ గురించి ఒక ట్వీట్ కూడా పెట్టకుండా ముంబయి వెళ్లిపోవడంపై ఫైర్ అయ్యారు. మరోవైపు ఖుషి దర్శకుడు శివ నిర్వాణ కూడా సినిమా షూటింగ్ త్వరలో రీ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు కానీ డేట్ చెప్పలేదు.