Samantha Ruth Prabhu Drops Bollywood Films Due To Health Issues
mictv telugu

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ఇక నా వల్ల కాదు.. సమంత సంచలన ప్రకటన

December 20, 2022

samantha takes break from bollywood due to health condition

తెలుగు సెన్సేషన్ సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి ఎంత చికిత్స తీసుకున్న ఫలితం కనిపించటం లేదని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని.. ప్రస్తుతం మయోసైటిస్ తగ్గకపోగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని.. దాంతో ఆరోగ్యం క్షిణిస్తుండటంతో సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ విజయం తరువాత వరుసగా బాలీవుడ్ చిత్రాలకు కమిట్ అయింది సమంత. క్షణం తీరిక లేకుండా బాలీవుడ్ డేట్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. అయితే ప్రస్తుతం తన అనారోగ్యం దృష్ట్యా ఇక సినిమాలు చాలు అనుకుంటుందట సామ్. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం కుదుటపడే వరకు లాంగ్ గ్యాప్ తీసుకుంటానని బాలీవుడ్ నిర్మతలకు చెప్పేసిందట సామ్.

సమంత చివరిగా యశోద చిత్రంలో నటించింది. మయోసైటిస్ కారణంగా సినిమా ప్రచారంలో ఆమె పాల్గొనలేదు. ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు నటనకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం. సమంత పూర్తిగా కోలుకునే వరకు నటనకు సుదీర్ఘ విరామం ప్రకటించటంతో బాలీవుడ్ నిర్మాతలు సమంత స్థానాన్ని భర్తీ చేసే హీరోయిన్ వేట మొదలుపెట్టారట. ఇక ప్రస్తుతం సౌత్ లో సామ్ నటిస్తున్న ఒకే ఒక చిత్రం ఖుషి. విజయ్ దేవరవరకొండ హీరోగా చేస్తున్న ఈ మూవీ 60శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. మిగితా 40శాతం కూడా పూర్తిచేసి దక్షిణ సినిమాలను కూడా సమంత అవాయిడ్ వదిలేయనుందని అంటున్నారు. ఏదేమైనా.. ప్రాణాంతక వ్యాధి మయోసైటిస్ నుండి త్వరగా కోలుకుని సమంత మళ్ళీ సినిమాల్లో నటించాలని ఆడియన్స్ అందరిని కలవరపెడుతున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ఫ్లైట్ నుంచి దూకుతూ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన స్టార్ హీరో

ఆర్ఆర్ఆర్ కి షాక్.. బుక్ మై షో బెస్ట్ ఇండియన్ మూవీస్

తను లేకపోతే బన్నీ లేడు..!