ఫేస్‌బుక్‌లో చై, సామ్ ల పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత తండ్రి
నాగచైతన్య, సమంత ఓ టైంలో టాలీవుడ్ బెస్ట్ కపుల్. కానీ ఈజంట అనుకోకుండా విడాకులు తీసుకుంది.కానీ ఈ జంట విడిపోయి కొన్ని నెలలు అవుతున్నా ఇంకా వారి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. గత ఏడాది అక్టోబర్ 2న ఈ ఇద్దరు విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే విడాకుల దగ్గర నుండి ఇటు సమంత,అటు చైకి మీడియా నుండి వారి విడాకులకు సంబంధించి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం ఎవరికీ తెలియదు.
కారణాలేమైనప్పటికీ విడిపోయిన తర్వాత సమంత, నాగచైతన్య ఎవరిదారిలో వారు పయనిస్తూ ఉన్నారు. సమంత కెరియర్ పరంగా ప్రస్తుతం బాలీవుడ్ పైన దృష్టి పెట్టింది. ఇక నాగచైతన్య కూడా లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన చేసినప్పటి నుంచి వీరు ఇరువురు కుటుంబాలు కూడా ఎప్పుడు ఈ విషయంపై స్పందించలేదు. అయితే మొదటిసారి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు సోషల్ మీడియాలో స్పందించారు.
తన ఫేస్‌బుక్ పేజ్ లో .. సమంత, నాగచైతన్య ల పెళ్లినాటి ఫోటోలను షేర్ చేశారు. వారిద్దరు విడిపోయారని తెలిసినప్పుటి నుంచి తన మైండ్ బ్లాక్ అయిందని తెలియజేశారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. వీరిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తను చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలియజేశారు. సమంత నాగచైతన్య అంటే తనకు చాలా ఇష్టమని వారితో గడిపిన కాలాన్ని మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోవదని తెలియజేశారు. ఈ పోస్ట్ చూస్తుంటే సమంత కుటుంబం ఇప్పటికీ నాగ చైతన్యను మరచిపోలేదని తెలుస్తోంది.