ప్రముఖ హీరోయిన్ సమంత గత కొన్ని నెలల పాటు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే కండరాల బలహీన వ్యాధితో సతమతమయ్యారు. షూటింగ్‌ల కూడా దూరం కావాల్సి వచ్చింది. 7-8 నెలల పాటు ఆమె ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ కఠిన సమాయాన్ని పలు మార్లు గుర్తు తెచ్చుకుంటూ పబ్లిక్ గానే సమంత కన్నీలు పెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
ఈ మధ్యనే మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్..పలు కార్యక్రమాలకు హాజరవుతోంది. సినిమాల్లో కూడా స్పీడ్ పెంచింది. తిరిగి షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నారు. తాజాగా ఇన్ స్టా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది సామ్. సిటాడెల్ టీమ్‌తో మీటింగ్, వర్కౌట్లు, అలసట, ఫోటోషూటలతో గత నెల పూర్తైందంటూ ఫోటోలను షేర్ చేసి..తన కఠిన సమయంలో ఎదుర్కొన్న అనుభవాన్ని రాసుకొచ్చారు.
“గట్టిగా ఊపిరి పీల్చుకో పాపా. త్వరలో అన్నీ చక్కబడతాయని నీకు నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడు ఏనిమిది నెలల నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులను చూసావు. వాటితోనే మందుకు సాగావు. ఆ కఠిన సమయాలను మర్చిపోవద్దు. ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఆలోచించడం మానేశావు. దేనిపైనా దృష్టిపెట్టలేకపోయావు. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులున్నా ముందుకు సాగావు” అని సమంత పోస్ట్ చేశారు.
సమంత నటించిన శాకుంతలం చిత్రం విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన శాకుంతలం వెనక్కి వెళ్ళింది. గతంలో కూడా ఒకసారి శాకుంతలం వాయిదా వేశారు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు.