అందం, అభినయంతో అచిరకాలంలో కోట్లాది మంది అభిమానం చూరగొంది సమంత. తెలుగింటి కోడలై మరింత దగ్గరైంది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆమె హుందాగా తన కెరీర్ సాగిస్తూ నటనలో, సామాజిక సేవలో ముందుంది. నాగచైతన్యంతో పెళ్లి, విడాకుల తర్వాత కాస్త డిస్టర్బ్ అయినట్లు కనపించిన సామ్.. హఠాత్తుగా తనకో అరుదైన జబ్బు ఉందని కలకలం రేపింది. విషయం తెలిసి అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. తనకు మ్యూసిటిస్ అనే వ్యాధి ఉంనది ఆమె చెప్పింది. ఇది కండరాల జబ్బు. నీరసం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం దీని లక్షణాలు. ప్రాణాంతకం కాని ఈ జబ్బుకు చక్కని చికిత్సలే ఉన్నాయి.
View this post on Instagram
తనకు చర్మవ్యాధి ఉందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఆమె తన అనారోగ్యంపై పూర్తి వివరాలను ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పంచుకున్నారు. తనకు మ్యూసిటిస్ అనే కండర బలహీనత వ్యాధి ఉందని చెప్పారు. ఒక ఫోటో కూడా షేర్ చేసింది. చేతికి సెలైన్‌తో కనిపిస్తోంది సామ్ అందులో. డబ్బింగ్ చెబుతున్నప్పుడు వెనకాల నుంచి ఈ ఫోటో తీసినట్లు వెల్లడించింది. ‘యశోద సినిమా ట్రైలర్‌పై స్పందన చూసి సంతోషంగా ఉంది. అదే అభిమానులకు నాతో ఉన్న బంధం. ఆ ప్రేమతో ఈ కష్టాలను ఎదుర్కొంటున్నాను. మ్యూసిటస్‌తో బాధపడుతున్నారు. అనే వ్యాధితో బాధపడుతున్నాను. కొన్ని నెలల కిందటే ఈ వ్యాధి సోకినట్లు తెలిసింది. కాస్త ఆలస్యం మీకు చెబుతున్నాను. అయితే అన్నీఅందరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. త్వరలోనే కోలుకుంటానని వైద్యులు చెప్పారు.. ’ సమంత రాసింది. తాత్విక ధోరణిలోకి వెళ్లిపోయి. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, ఇదీ అంతేనని చెప్పింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె కోలుకోవాలని కోరుతున్నారు.