Samantha Ruth Prabhu's Instagram account hacked? Here's the truth
mictv telugu

సమంత ఖాతాలో మంత్రి కేటీఆర్ పోస్ట్.. ఇన్‌స్టా స్టోరీ వైరల్

July 6, 2022

Samantha Ruth Prabhu's Instagram account hacked? Here's the truth

ఎప్పుడూ తన సినిమా అప్డేట్స్‌తోపాటు తన పర్సనల్ లైఫ్, సోషల్ ఫ్యాక్టర్స్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే హీరోయిన్ సమంత.. తొలిసారి రాజకీయాలకు సంబంధించిన పోస్ట్‌ పెట్టారు. అది కూడా కేటీఆర్‌ ఫోటో షేర్‌ చేస్తూ.. ‘నా ప్రజలే నా బలం, నా ధైర్యం, నా నమ్మకం’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్‌, ఫ్యాన్స్‌ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ‘ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రాబోతున్నారా? సామ్‌’ అంటూ ఆమెను అంతా ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారడంతో సమంత డిజిటల్ మేనేజర్ శేషాంక బినాష్ రంగంలోకి దిగింది. ఇది సమంత చేసిన పోస్ట్‌ కాదని, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందని స్పష్టం చేసింది. ‘టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వల్లే ఇలా జరిగింది. ఒక గ్రూప్‌లో పోస్ట్‌ చేయాల్సిన పోస్ట్‌.. సమంత గ్రూప్‌లో యాడ్‌ అయ్యింది. మేం ఈ పోస్ట్‌ ఎవరూ చేశారనే దానిపై ఆరా తీస్తున్నాం. దీనిపై మా ఇన్‌స్టాగ్రామ్‌ టీంతో చర్చిస్తున్నాం. వారు ఎవరో తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉంటాం. మీకు అసౌకర్యాన్ని కలిగించినందుకు క్షమాపణలు’ అంటూ ఆమె పోస్ట్‌ చేసింది. ఇక ఇదే పోస్ట్‌ను స్క్రీన్‌ షాట్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇకపోతే ప్రస్తుతం సామ్ తెలుగులో యశోద, శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది.