samantha says shakunthalam movie review
mictv telugu

శాకుంతలం సినిమాపై సమంత రివ్యూ..ఏం చెప్పిందంటే ?

March 14, 2023

samantha says shakunthalam movie review

ప్రముఖ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ హిస్టారికల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో శాకుంతలంను విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. మూవీ ప్రమోషన్స్ ను భారీగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సైతం ఆకట్టుకుంటోంది.

మరోవైపు సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నాక వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఆభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని సమంత చూసి రివ్యూ చెప్పేశారు. దర్శకుడు గుణశేఖర్, నిర్మాతలు ‘దిల్’ రాజు, నీలిమా గుణతో కలిసి వీక్షించిన సమంత..సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.

”చివరికి నేడు శాకుంతలం’ సినిమా చూశా. చాలా అందంగా ఉంది. ఇదొక దృశ్య కావ్యం. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైన శకుంతల, దుష్యంత మహారాజు కథకు ఆయన ప్రాణం పోశారు. బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. ఫ్యామిలీ ఆడియెన్స్ పవర్ ఫుల్ ఎమోషన్స్ తో సినిమాను ఆస్వాదిస్తారు.. పిల్లలకు ఈ ప్రపంచం నచ్చుతుంది. ఇటువంటి సినిమా ఇచ్చిన ‘దిల్’ రాజు, నీలిమా గుణలకు థాంక్స్” అని సోషల్ మీడియాలో సమంత తన రివ్యూను పోస్ట్ చేశారు.