టాలీవుడ్ యాక్టర్ సమంత ఓవైపు వరస సినిమాలతో బీజీ బీజీగా ఉంటూనే, మరోవైపు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగేళ్లపాటు కొనసాగిన తర్వాత నాగచైతన్యతో విడిపోతున్నానని అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమంత వరస సినిమాలకు ఓకే చెప్తూ, జోరు పెంచింది. తన కొత్త సినిమాలకు సంబంధించిన ఆప్‌డేట్స్‌ను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. అంతేకాకుండా విహారయాత్రలు చేస్తూ, రకరకాల యాక్టివిస్తో సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్‌కు సమంత ఎన్నికైంది. ఈ అవార్డును స్వీకరించేందుకు సమంత ముంబైకి వెళ్లింది. అవార్డ్ ఫంక్షన్ కోసం ఎమరాల్డ్ గ్రీన్, నలుపు రంగు నైనికా డ్రెస్‌ను ధరించి మరింత అందంగా కనిపిస్తూ, తన అందంతో అందరినీ కట్టిపడేస్తుంది.
ఈ సందర్భంగా తన స్టైలిస్ట్ ప్రీతమ్ జూకాల్కర్ ఎంతో స్టైలిష్‌గా రెడీ చేశారని తెలుపుతూ.. ఆయనకు ఈ ఫొటోస్ ట్యాగ్ చేసింది. ఇవి తన ఫేవరైట్ లుక్స్ అంటూ ఆమె పెట్టిన కామెంట్స్ జనాల్లో హాట్ ఇష్యూగా మారాయి. సమంత షేర్ చేసిన ఈ ఫొటోస్ చూస్తే నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టిందని, హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చేలా అడుగులు పడుతున్నాయని స్పష్టమవుతోందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా సమంత, ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జూకాల్కర్ ఎంత క్లోజ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత చేసే పనుల్లో ప్రీతమ్‌ల హ్యాండ్ ఎంతో కొంత అయినా ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కొన్ని పుకార్లు కూడా పుట్టించింది. సమంత- ప్రీతమ్ రిలేషన్‌పై అప్పట్లో జనాలు పలు రకాలుగా చెప్పుకున్న విషయం తెలిసిందే.
‘ఇది కలలా కనిపిస్తుంది’ అంటూ సమంతా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఫోటోని షేర్ చేసింది. ‘నాకు అత్యంత ఇష్టమైన లుక్‌లో ఇదొకటి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక, హన్సిక వంటి హీరోయిన్లు సైతం స్పందించారు.