సమంతా రూత్ ప్రభు నటించిన ‘శాకుంతలం’ నుండి మెలోడీ సాంగ్ ఒకటి రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ చిత్ర నిర్మాతలు ‘మల్లికా మల్లిక’ పేరుతో మొదటి సింగిల్‌ను షేర్ చేస్తూ.. ఇతర భాషల్లో కూడా ఈ పాటని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ అందమైన మెలోడీ నంబర్‌కి రమ్య బెహరా తన గాత్రాన్ని అందించగా మణిశర్మ స్వరాలు సమకుర్చారు. శాకుంతలం ప్రొడక్షన్ బ్యానర్ గుణ టీమ్‌వర్క్స్ ఈ పాటను ఆవిష్కరిస్తూ.. ‘శాకుంతలంలోని మంత్రముగ్ధులను చేసే మల్లికా లిరికల్ వీడియో సాంగ్ ఇప్పుడు విడుదలైంది!.” అని ట్వీట్ చేసింది.
గుణ టీమ్‌వర్క్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మించిన ‘శాకుంతలం’ ట్రైలర్ జనవరి 9న విడుదలై ఇప్పటికే మంచి క్రేజ్ దక్కించుకోగా.. ఇప్పుడు మల్లికా సాంగ్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ‘మల్లికా మల్లికా .. మాలతీ మాలిక, చూడవా .. చూడావా .. ఏడే నా ఏలిక’ అంటూ సాగే పాటలో సమంత బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ లోని గ్రాఫిక్స్ కూడా అద్దిరిపోయాయని అంటున్నారు. ఇక శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ చిత్రంలో నటించారు. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమిలు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం వచ్చేనెల 17న వివిధ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.