‘నువ్వు వయస్సును జయించావు మామా’ : సమంత
View this post on InstagramA post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వయస్సు పెరిగినా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆరు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. యంగ్ జనరేషన్‌కు తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మథుడు2 సినిమాతో తనలో ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదని చూపించాడు. ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం వల్లే తాను ఇంకా కుర్రాడిలా ఉంటానంటూ చెబుతుంటారు.
నాగ్ ఫిట్‌నెస్ ఎలా ఉందో తాజాగా ఆయన కోడలు సమంత ఓ ఫొటోను తీసి అభిమానులతో పంచుకుంది. 60వ పుట్టిన రోజు వేడుకల కోసం కుటుంబంతో కలిసి నాగార్జున స్పెయిన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా స్విమ్మిగ్‌ఫుల్‌లో నిలబడి కండలు చూపిస్తూ దృఢమైన శరీరాన్ని చూపిస్తూ ఫోజ్ ఇచ్చారు. ఈ ఫొటోను సమంతా తన ఇన్‌స్ట్రాగ్రాంలో షేర్ చేస్తూ ‘మీరు వయస్సును జయించారు మామా’ అంటూ కామెంట్ పెట్టింది. ఇది చూసిన అక్కినేని అభిమానులు నాగ్ ఫొటోకు తెగ లైకులు, కామెంట్లు పెడుతున్నారు.